విజయనగరం జిల్లాలోని 9 శాసనసభ స్థానాలకు 74మంది, ఒక పార్లమెంటు నియోజకవర్గానికి 14మంది అభ్యర్ధులు పోటీపడ్డారు. 18లక్షల 18వేల 113ఓటర్లకు గాను... 14లక్షల 66వేల 291మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ మేరకు ఓట్ల లెక్కింపు కోసం విజయనగరంలో నాలుగు లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎంవీజీర్ ఇంజనీరింగ్ కళాశాలలో పార్వతీపురం, కురుపాం, సాలూరు, శృంగవరపుకోట నియోజకవర్గాలు.., లెండి ఇంజనీరింగ్ కళాశాలలో నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజవకవర్గాల ఓట్లు లెక్కింపు జరగనుంది. జేఎన్టీయూ అనుబంధ కళాశాలలో గజపతినగరం, బొబ్బిలి నియోజకవర్గాలు,.. జిల్లా పోలీసు శిక్షణ కళాశాలలో విజయనగరం శాసనసభ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు కొరకు విస్తృతంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని కలెక్టర్ హరి జవహర్ లాల్ ఈటీవీ భారత్ ముఖాముఖిలో తెలిపారు.
విజయనగరంలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ - ఏర్పాట్లు
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేలా విజయనగరంజిల్లాలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు పూర్తి ఏర్పాట్లు, భద్రతా చర్యలు తదితర అంశాలపై కలెక్టర్ హరి జవహర్ లాల్ తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఓట్ల లెక్కింపు పూర్తి ఏర్పాట్లపై కలెక్టర్ జవహర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి