విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం శివరామరాజుపేటలో శిరిష అనే యువతిపై హత్యాయత్నం జరిగింది. వేపాడ మండలం ఆకుల సీతంపేటకు చెందిన శీరీష...ఎస్.కోటలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. నిన్న సాయంత్రం అదే గ్రామంలోని తన మేనత్త ఇంటికి వెళ్లింది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం గమనించి... సుకురు బంగారు పుల్లయ్య అనే యువకుడు హత్యయత్నాంచేశాడు. యువతి మెడలో ఉన్న చున్నీని గట్టిగా బిగించి చంపేందుకు ప్రయత్నం చేశాడు. ఆమె ముక్కునుండి రక్త స్రావం జరిగి స్పృహతప్పి పడిపోయింది. శిరీష మృతి చెందిందని భావించిన యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. అలికిడి విని కుటుంబసభ్యులు బయటికిరాగా...శీరీష ప్రాణాపాయస్థితిలో ఉండడాన్ని గమనించారు. ఆమెను వెంటనే శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పుల్లయ్యను ఆకుల సీతంపేట గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు... ఆచూకీ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
మెడకు చున్నీ బిగించి హత్యాయత్నం.. అనంతరం?? - _yuvati_atempt_murder_
ప్రేమ పేరుతో యువతి మెడకు చున్నిని బిగించి హత్యయత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. మృతి చెందిందని భావించి సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు.
యువతిపై యువకుడు హత్యాయత్నం