విజయనగరం జిల్లా కురుపాం మండలం గోటివాడ గ్రామంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో పెద్దగా ఉరుములు మెరుపులతో వరసగా పలుచోట్ల పిడుగులు పడ్డాయి. సమీపంలో ఉన్న పొలంలో తిమ్మక శంకర్ రావు అనే గిరిజన రైతుకు చెందిన రెండు దుక్కిటెడ్లు పిడుగులు పడి అక్కడికక్కడే మృతి చెందాయి. అలాగే జియ్యమ్మవలస మండలం పిప్పలభద్ర గ్రామంలో ఓ రైతుకి చెందిన పాడి గేదె మృత్యువాత పడింది.
పిడుగు పాటుకు మూగజీవాల మృత్యువాత - animals died with thunderbolt
పిడుగుపాటుకు రెండు ఎద్దులు, ఒక గేదె మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా కురుపాం మండలంలో చోటు చేసుకుంది. మృతి చెందిన పశువులకు సంబంధించి తనకు పరిహారం చెల్లించాలని బాధిత రైతు కోరుతున్నాడు.
పిడుగు పాటుకు 2 దిక్కు ఎద్దులు, ఒక గేదె మృతి…