బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుపానుగా మారుతున్న నేపథ్యంలో... విజయనగరం జిల్లావ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది. భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో తీరం వెంబడి సముద్రం అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి.
విజయనగరం జిల్లాలో అంపన్ ప్రభావం... ఎగసిపడుతున్న అలలు
విజయనగరం జిల్లాలో అంపన్ సైక్లోన్ ప్రభావంతో సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. ఆకాశం మేఘావృతమై చల్లటి గాలులు వీస్తున్నాయి. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
విజయనగరం జిల్లాలో అంపన్ ప్రభావం
తుపాను బలపడే సమయంలో గాలుల ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని.. వాతావరణశాఖ హెచ్చరికలు జారిచేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. తీరప్రాంత గ్రామాల్లో రెవెన్యూ, పోలీసు అధికారులు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు.
ఇవీ చదవండి.. ఉద్యోగాలు కోల్పోతున్నాం.. ధ్రువీకరణ పత్రాలు ఇవ్వండి'