సాలూరు మున్సిపల్ ఎన్నికల్లో 27వ వార్డులో వైకాపా అభ్యర్థిగా.. భవిరెడ్డి గౌతమి పోటీ చేస్తున్నారు. ఆమె తన నామినేషన్లో గృహిణిగా పేర్కొన్నారు. అయితే గౌతమి పాచిపెంట మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 104 వాహనంలో ఏఎన్ఎంగా పని చేస్తోందని తెదేపా నేత నిమ్మది తిరుపతిరావు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల 1965 యాక్ట్ ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని అన్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్‌తో పాటు ఎన్నికల అధికారికి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. అవసరమైతే దీనిపై కోర్టుకు వెళ్తామని ఆయన అన్నారు.
సాలూరులో వైకాపా అభ్యర్థిపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు - సాలూరులో వైకాపా అభ్యర్థిపై ఆరోపణలు
విజయనగరం జిల్లా సాలూరు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైకాపా అభ్యర్థిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగి అయినా.. రాజీనామా చేయకుండా పోటీ చేస్తోందని.. ఇతర పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయం చేయాలని ఎన్నికల అధికారిని కోరారు.
సాలూరులో మున్సిపల్ ఎన్నికల అభ్యర్థిపై ఆరోపణల వెల్లువ..