మాన్సాస్ ట్రస్ట్ ఈవోకు సింహాచలం ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలు - మాన్సాస్ ట్రస్ట్ ఈవో వెంకటేశ్వరరావు తాజా వార్తలు
విజయనగరం జిల్లాలోని మాన్సాస్ ట్రస్ట్ ఈవో వెంకటేశ్వరరావుకు సింహాచలం ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలను దేవదాయశాఖ అప్పగించింది. ప్రస్తుతం ఆ స్థానంలో కొనసాగుతున్న త్రినాథరావును తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మాన్సాస్ ట్రస్ట్ ఈవోకు సింహాచలం ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలు
సింహాచలం ఆలయ ఈవోగా.. మాన్సాస్ ట్రస్ట్ ఈవో వెంకటేశ్వరరావుకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ దేవదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సింహాచలం ఈవోగా కొనసాగుతున్న.. అన్నవరం ఈవో త్రినాథరావును తొలగిస్తున్నట్లు పేర్కొంది. ఆయన స్థానంలో వెంకటేశ్వరరావును నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.