విజయనగరం జిల్లా పార్వతీపురం తపాలా కార్యాలయంలో ఆధార్ కార్డ్‌కి ఫోన్ నెంబర్ లింక్ చేస్తున్నారు. అందుకోసం ఆ ప్రాంతానికి పెద్దసంఖ్యలో ప్రజలు వెళ్లడంతో రద్దీ ఏర్పడింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి అనుసంధానం తప్పనిసరి కావడంతో జనం బారులు తీరుతున్నారు. పట్టణంలో మూడు చోట్ల అనుసంధాన కేంద్రాలు ఏర్పాటు చేశారు.
చుట్టుపక్కల మండలాల ప్రజలు పట్టణంలోని తపాలా కార్యాలయం వద్దకు వస్తున్నారు. దీంతో సిబ్బందికి ఒత్తిడి తప్పడం లేదు. అధిక సంఖ్యలో జనం తరలిరావడంతో గంటల తరబడి బాధితులు గంటలు తరబడి క్యూలైన్లలో నిల్చుంటున్నారు. అదనపు సమయం కేటాయించి సిబ్బంది రాత్రి 7 గంటల వరకు అనుసంధానం పనులు చేస్తున్నారు. సచివాలయంలో ఈ సేవలు అందుబాటులో ఉంటే ఉపయుక్తంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు.