ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యే అదీప్ రాజు భూ కబ్జాలకు పాల్పడ్డారు: తెదేపా

తెదేపా జడ్పీటీసీ అభ్యర్థి గండి రవికుమార్ విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీపై చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు.

vishakha zptc elections
ఎమ్మెల్యే అదీప్ రాజు భూ కబ్జాలకు పాల్పడ్డారన్న తెదేపా నేతలు

By

Published : Apr 9, 2021, 8:36 PM IST

విశాఖ జిల్లా పెందుర్తి శాసనసభ్యుడు అదీప్ రాజు నియోజకవర్గంలో భూ కబ్జాలకు పాల్పడుతున్నారని తెదేపా జడ్పీటీసీ అభ్యర్థి గండి రవికుమార్ ఆరోపించారు. పరవాడ మండలంలోని దలయపాలెంలో ఎమ్మెల్యే 40 ఎకరాల భూమిని కబ్జా చేశారన్నారు. కానీ తన ఆధీనంలో ఆరు ఎకరాల భూమి ఉందని ఒకసారి.. ఇరవై ఐదు సెంట్ల స్థలంలో మాత్రమే తనకు గెస్ట్ హౌస్ ఉందని మరోసారి భిన్నంగా ప్రస్తావించారని ఆయన తెలిపారు. పెందుర్తి మండలం చీమలాపల్లిలో ఎమ్మెల్యే రూ. 10 కోట్ల విలువైన 2300 గజాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు.

పాలక వైఫల్యం కలసివచ్చింది..

నియోజకవర్గంలో జరిగిన పరిషత్​ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పోలింగ్​ బూత్​లోకి వెళ్లి భయబ్రాంతులకు గురి చేశారని ఎమ్మెల్యే అదీప్ రాజు ఆరోపించడాన్ని రవికుమార్ తప్పుబట్టారు. కేవలం పోలింగ్​ బూత్​ ఏజెంట్​గా లోనికి ప్రవేశించారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అసమర్థ పాలన వల్లే తెదేపా మున్సిపల్​ ఎన్నికల్లో 10వార్డుల్లో ఎనిమిదింటిని గెలుపొందిందని గుర్తు చేశారు. పరిషత్​ ఫలితాల్లో ఇదే జోరు కొనసాగుతుందని రవి కుమార్ ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ పాలకవర్గం తీర్మానం

ABOUT THE AUTHOR

...view details