విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ కేంద్రం జాతీయ రహదారికి ఆనుకుని ఉంది. ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు ఈ దారిన పోయేటప్పుడు కాసేపు సేద తీరేందుకు జిల్లా పరిషత్ అతిథి గృహాన్ని నిర్మించారు. సుమారు రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ నూతన భవనానికి విద్యుత్ సౌకర్యం లేకపోవటంతో నిరుపయోగంగా మారింది. ఉన్నతాధికారులు, మంత్రులు విశ్రాంతి తీసుకోవడానికి కనీస ఫర్నిచర్ భవనంలో లేదు. అధికారులు ఏవైనా సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు అనుమతి లేకుండా విద్యుత్‌ను వాడుతున్నారు. ఈ అధునాతన భవనంలో సౌకర్యాలు సరిగ్గా లేవని సమావేశాలు రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి. గతంలో నాయకులు విశ్రాంతి తీసుకునే భవనం పట్టణానికి చాలా దూరంలో ఉండేది. ఈ నేపథ్యంలో అందరికీ అందుబాటులో ఉండేలా ఈ నూతన భవనాన్ని గత ప్రభుత్వం మంజూరు చేసింది. సమస్యపై సంబంధిత అధికారులను వివరణ కోరగా, విద్యుత్ సౌకర్యం... ఫర్నిచర్ కొరకు రూ.30 లక్షలు అంచనా వ్యయంతో పై అధికారులకు నివేదించినట్లు తెలిపారు.
అసలుకు పెట్టి... కొసరుకు మరిచారు...!
విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ కేంద్రం జాతీయ రహదారి సమీపంలో నిర్మించిన జిల్లా పరిషత్ అతిథి గృహం నిరుపయోగంగా మారింది. ఉన్నతాధికారులు... ప్రజాప్రతినిధులు అటువైపు వెళ్లేప్పుడు కాసేపు సేద తీరేందుకు ఈ భవనాన్ని నిర్మించారు. కానీ సరైన వసతులు లేకపోవటం సమస్యగా మారింది.
నిరుపయోగంగా మారిన జిల్లా పరిషత్ అతిథి గృహాం