YSRCP Government Careless on Tourism Development :2020 ఆగస్ట్ 20న పర్యాటక శాఖపై సీఎం సమీక్ష జరిపి పర్యాటక అభివృద్ధి చేయాలని సెలవిచ్చారని.. నాటి పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ (Avanti Srinivas) అన్నారు. కానీ ఆ దిశగా ఎలాంటి అడుగు ముందుకు పడలేదు. పైగా అందమైన విశాఖలోని రుషికొండ బీచ్ (Rushikonda Beach) రిసార్ట్‌ని కూలదోశారు. ఆధునీకరిస్తున్నామని చెప్పి 350 కోట్లకుపైగా ఖర్చు చేసి చివరకు సీఎం నివాసంగా మార్చేశారు.
Andhra Pradesh Tourism Sector : సువిశాలమైన తీరప్రాంతం ఏపీకి ఉన్నా దాన్ని వినియోగించుకోవడంలో వైఎస్సార్సీపీ సర్కార్ విఫలమైంది. బీచ్‌లలో వసతుల కల్పనకు రూపాయి ఖర్చు చేసిన పాపాన పోలేదు. తెలుగుదేశం హయాంలో బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ (Surya Lanka Beach)లో పర్యాటకులకు షెల్టర్లు ఏర్పాటు చేస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాటిని తొలగించి.. సందర్శకులను అవస్థలపాల్జేసింది. మైపాడు బీచ్ (Mypadu Beach)లో పాడైన రిసార్ట్‌ల ఆధునికీకరణకు రూ.5 కోట్ల92 లక్షలు కేటాయించలేకపోయింది.
Tourism Development Situation in AP :రాష్ట్రంలో చాలా చోట్ల బీచ్‌లు ఉంటాయి. కానీ రుషికొండ బీచ్ మాత్రం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. పచ్చని కొండ ప్రాంతం, అందమైన ఇసుక తిన్నెలు, మత్స్యకారులు, చిన్నారులు, స్థానికులు, రోజూ వాకింగ్ చేసేవారు. ఇలా చాలా మంది ఇక్కడ తిరుగుతూ ఉంటారు. ఇలాంటి చోట బీచ్ నిర్వహణ అనేది చాలా ముఖ్యం. బీచ్ బాగుంటేనే ఎక్కవ మందిని ఆకర్షించగలదు. నిర్వహణ సరిగ్గా లేకుంటే పర్యాటకులు వచ్చేందుకు ఆసక్తి చూపరు.
విశాఖ తీరంలో సుందరీకరణ పేరుతో విధ్వంసం.. జీవీఎంసీ నిర్వాకంపై పర్యావరణ వేత్తల ఆందోళన
No Blue Flag Beach Development In Andhra Pradesh : తీర ప్రాంతాల్లో బీచ్‌ల సమగ్రాభివృద్ధికి బ్లూఫ్లాగ్ (Blue Flag Beach) విధానాన్ని కేంద్రం ప్రయోగాత్మకంగా ఐదేళ్ల క్రితం అమలు చేసింది. ఒక్కో బీచ్‌లో 10 కోట్లు వెచ్చించి 12 బీచ్‌లను అభివృద్ధి చేసి, రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. వీటిలో రుషికొండ బీచ్ ఒకటి. ఇదే మోడల్‌లో రాష్ట్రంలో మరో 9 బీచ్‌ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు వేసి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ప్రతినిధులతో కలిసి సర్వే చేయించింది. సూర్యలంక, రామాపురం, పేరుపాలెం, ముళ్లపర్రు, కాకినాడ, చింతలమోరి, మంగినపూడి, ఎర్రమట్టి దిబ్బలు, మైపాడు బీచ్‌ల్లో ప్రమాదాలకు ఆస్కారం తక్కువని గుర్తించారు. 9 బీచ్‌లకు కలిపి 67.5 కోట్ల రూపాయలు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేటాయించకపోవడంతో ప్రతిపాదిత బ్లూఫ్లాగ్ బీచ్‌ల అభివృద్ధి కాగితాలకే పరిమితమైంది.