ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈతకు వెళ్లారు.. ఇంతలోనే వరదొచ్చింది! - youth

ఈతకు వెళ్లిన యువకులు వరద ఉద్ధృతిలో చిక్కుకున్నారు. దాదాపు ఆరు గంటలపాటు ఓ రాయిపై బిక్కుబిక్కుమంటూ గడిపారు. వరద మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో కొంతమంది సాహసం చేసి వారిని కాాపాడారు.

టీపీ ఢ్యాం

By

Published : May 18, 2019, 11:12 AM IST

ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్ కేంద్రానికి చెందిన టీపీ ఢ్యాం వద్ద నలుగురు యువకులు ఈతకు దిగి వరద ఉద్ధృతిలో చిక్కుకుపోయారు. వివరాల్లోకి వెళితే... ఒనకఢిల్లీ ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు శుక్రవారం టీపీ డ్యాంలో ఈతకు దిగారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో విద్యుత్ కేంద్రంలో సాంకేతిక లోపం తలెత్తి జనరేటర్లన్నీ ఆగిపోయి టీపీ ఢ్యాం వద్ద వరద ఉద్ధృతి పెరిగింది. దాదాపు 6 గంటల పాటు యువకులు ఒక రాయిపై నిలబడి ప్రాణాలను కాపాడుకున్నారు. ఎట్టకేలకు ఒనకఢిల్లీ గ్రామానికి చెందిన స్థానికులు సాహసించి తాళ్ల ద్వారా నలుగురు యువకులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. భారీ వర్షం కురవడం వల్ల ఆ ప్రాంతం మొత్తం విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సమాచార వ్యవస్థ స్తంభించిపోయింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details