విశాఖ జిల్లా యలమంచిలి పట్టణంతో సహా విలీన గ్రామాల్లో కరోనా వైరస్ నివారణకు క్లోరిన్ ద్రావణాన్ని అగ్నిమాపక అధికారులు వీధుల్లో పిచికారీ చేశారు. పాత జాతీయ రహదారిపై, రోడ్డు పక్కన దుకాణాలపైన ఈ మందును చల్లారు. శక్తివంతమైన మోటార్లతో మందును స్ప్రే చేయించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని స్థానిక అగ్నిమాపక కేంద్రం అధికారి ముదునూరి లక్ష్మీపతి రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. వారం రోజుల పాటు ఇలా మందును చల్లిస్తామన్నారు.
కరోనా నివారణకు ఎలమంచిలిలో క్లోరిన్ పిచికారీ - యలమంచిలి తాజా సమాచారం
ఎలమంచిలి పరిధిలో కరోనా వైరస్ను నిరోధానికి స్థానిక అగ్నిమాపక కేంద్రం అధికారులు చర్యలు తీసుకున్నారు. క్లోరిన్ ద్రావణాన్ని పట్టణ పురవీధుల్లో పిచికారీ చేశారు.
ఎలమంచిలిలో క్లోరిన్ పిచికారి