వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే ప్రజలకిచ్చిన 90 శాతం హామీలను నెరవేర్చిందని విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ అన్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్కు ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక తెదేపా నేతలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించిన ఘనత సీఎం జగన్కు దక్కుతుందని అన్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కించుకోవటం కోసం మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వైకాపా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేశ్ పేర్కొన్నారు.
'సీఎం జగన్కు లభిస్తున్న ఆదరణ తట్టుకోలేకే తెదేపా ఆరోపణలు' - mla uma shankar ganesh latest news
ముఖ్యమంత్రి జగన్కు ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక తెదేపా నేతలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించిన ఘనత సీఎం జగన్కు దక్కుతుందని చెప్పారు.
ycp mla ganesh