ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ రాజధాని ప్రకటనను సమర్థిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

విశాఖ జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరులో వైసీపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. విశాఖని రాజధానిగా ప్రకటించినందుకు ఆనందం వ్యక్తం చేశారు.

vishaka district
విశాఖ రాజధాని నిర్ణయం పై హర్షం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు

By

Published : Aug 5, 2020, 11:41 PM IST

విశాఖ నగరాన్ని పరిపాలనా రాజధానిగా ప్రకటించటాన్ని సమర్థిస్తూ రోలుగుంట మండలం కొవ్వూరులో వైసీపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. గ్రామస్థులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పాలాభిషేకం చేశారు.

విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడం వల్ల నగరంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి చెందుతాయని వైకాపా నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానంగా పారిశ్రామికంగా మరింత పురోభివృద్ధి సాధిస్తుందని వైసీపీ నాయకులు ఎర్రంశెట్టి రాజారావు, ఎర్రంశెట్టి కాంతమ్మ, వై శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ఇదీ చదవండి'అర్హులైన గిరిజన రైతులకు అటవీ హక్కు పత్రాలివ్వాలి'

ABOUT THE AUTHOR

...view details