ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తీవ్రవాద ప్రాంతాల్లో కేంద్ర అభివృద్ధి పథకాలపై వర్క్​షాప్​ - Workshop in Visakha terrorist areas

వామపక్ష, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలు అనే అంశంపై... విశాఖలో కార్యశాల నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కలిగించే కళాబృందాలకు తమ సహకారం ఉంటుందని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి.రంగారావు తెలిపారు.

Workshop in Visakha about central government development schemes in terrorist areas
తీవ్రవాద ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలు అంశంపై విశాఖలో కార్యశాల

By

Published : Mar 9, 2020, 8:40 PM IST

తీవ్రవాద ప్రాంతాల్లో కేంద్ర అభివృద్ధి పథకాలపై వర్క్​షాప్​

తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో... ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కలిగించే కళాబృందాలకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి.రంగారావు అన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ బ్యూరో ఆఫ్ ఔట్​ రీచ్ ఆధ్వర్యంలో... విశాఖ వైశాఖి జల ఉద్యానవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలు అనే అంశంపై కార్యశాల నిర్వహించారు. సీఆర్పీఎఫ్ బలగాలు ఔట్ రీచ్ కార్యక్రమాలు, పోలీస్ శాఖ 'ప్రేరణ', 'యువత',' గిరి సంజీవిని' కార్యక్రమాలను గిరిజన ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాయని రంగారావు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details