ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మేము అలా చేస్తే జగన్ పాదయాత్ర చేసేవారా?: లోకేశ్ - jagan

నర్సీపట్నంలో తెదేపా చేపట్టిన బైక్​ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అందరూ హెల్మెట్లు ధరిస్తేనే ర్యాలీ నిర్వహించాలన్నారు. దీంతో నారా లోకేశ్ కాలి నడకనే ర్యాలీలో పాల్గొన్నారు. అలాగే అయ్యన్న జన్మదినం సందర్భంగా రక్తదానం చేస్తామంటే అనుమతి ఇవ్వడానికి ఇబ్బంది పెట్టారని లోకేశ్ మండిపడ్డారు.

నారా లోకేశ్

By

Published : Sep 4, 2019, 7:34 PM IST

Updated : Sep 4, 2019, 10:55 PM IST

నర్సీపట్నంలో నారా లోకేశ్ పర్యటన

స్థానిక సంస్థల ఎన్నికలకు తెలుగుదేశం సైన్యం సిద్ధంగా ఉండాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా నర్సీపట్నం లో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నిర్వహించిన బహిరంగ సభలో లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్రాన్ని జగన్ మోహన్ రెడ్డి తుగ్లక్​లా పరిపాలిస్తున్నారని విమర్శించారు. నర్సీపట్నంలో అయ్యన్న జన్మదినం సందర్భంగా రక్తదానం చేస్తామంటే అనుమతి ఇవ్వడానికి ఇబ్బంది పెట్టారని... తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తాము ఇలా చేస్తే జగన్ పాదయాత్ర చేసేవారా? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ముద్దులు పెట్టిన జగన్ ఇప్పుడు లాఠీ దెబ్బలు కొట్టిస్తున్నారని లోకేష్ విమర్శించారు. అందుకే దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంటి దగ్గరా లేని విధంగా జగన్ ఇంటి వద్ద 144 సెక్షన్ ఉందన్నారు. ప్రజలు కట్టే పన్నులను వాలంటీర్లకు జీతాలుగా ఇస్తున్నారని అన్నారు. అయ్యన్న పాత్రుడి పుట్టిన రోజు సందర్భంగా నారా లోకేశ్ హెల్మెట్లు పంపిణీ చేశారు.

ర్యాలీకి అనుమతి నిరాకరణ
బహిరంగ సభకు హాజరయ్యే ముందు అయ్యన్న పాత్రుడి జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో లోకేశ్ పాల్గొన్నారు. తొలుత బైక్ ర్యాలీ నిర్వహించాలని భావించినా పోలీసులు అనుమతి నిరాకరించటంతో లోకేశ్ కాలినడకన ఎన్టీఆర్ ఆసుపత్రికి చేరుకున్నారు. హెల్మెట్లు ధరిస్తేనే ర్యాలీని అనుమతిస్తామనటంపై అయ్యన్న అభ్యంతరం వ్యక్తం చేశారు. వేలాదిమంది ర్యాలీలో పాల్గొంటున్నందున పోలీసులు సాధ్యాసాధ్యాలు ఆలోచించాల్సి ఉందన్నారు. పోలీసుల తీరుకు నిరసనగా కార్యకర్తలు అంతా బైక్ ను తోసుకుంటూ లోకేశ్ వెనుక నడిచి తమ నిరసన తెలిపారు. ఎన్నికల తర్వాత తొలిసారి నర్సీపట్నం వచ్చిన లోకేశ్ లోకేశ్ కు కార్యకర్తలు, అభిమానులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు.


తెదేపా తిరగబడితే ఏమవుతుందో ఆలోచించాలి..

తెలుగుదేశం పార్టీకి చెందిన వారిపై దాడులు చేస్తున్న వైకాపా... 70లక్షల మంది కార్యకర్తలు తిరగబడితే ఏమవుతుందో ఆలోచించాలని నారా లోకేష్ హెచ్చరించారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో మీడియాతో మాట్లాడిన లోకేశ్... జగన్ ప్రభుత్వం ఈ 3నెలల్లో ఎన్ని కుంభకోణాలు బయటకు తీసిందని ప్రశ్నించారు. అమరావతి విషయంలో ఏదో కుంభకోణం జరిగినట్లు మాట్లాడుతున్నారని... మంత్రులతో పాటు ముఖ్యమంత్రికీ అమరావతిపై స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. అమరావతి ప్రజారాజధాని అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు.

Last Updated : Sep 4, 2019, 10:55 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details