ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ బాలికకు ప్రభుత్వం ఏం చేసింది..? - ఆ బాలికకు ప్రభుత్వం ఏం చేసింది…??

విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం జన్నేరులో అత్యాచారానికి గురైన గిరిజన బాలికకు ప్రభుత్వం ఏమి చేసిందని పాడేరు మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి ప్రశ్నించారు. వెంటనే ఆమెకు ప్రభుత్వ సాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

What did the government to that girl… ??
ఆ బాలికకు ప్రభుత్వం ఏం చేసింది…??

By

Published : Jul 7, 2020, 3:55 PM IST

విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం జన్నేరులో గిరిజన బాలిక అత్యాచారానికి గురై పది రోజులైనా ప్రభుత్వం ఎలాంటి భరోసా కల్పించకపోవడంపై మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి అసహనం వ్యక్తం చేశారు. గిరిజనులపై ప్రభుత్వం కపట ప్రేమ అర్థం చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదాన ప్రాంతాల్లో ఏ చిన్న ఘటన జరిగినా స్పందించే మహిళా కమిషన్ గిరిజన ప్రాంతంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే గ్రామాన్ని సందర్శించినా ఇప్పటికీ బాలికకు ఎటువంటి సహాయం, భరోసా ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. విశాఖ కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. ప్రభుత్వం వెంటనే 25 లక్షల పరిహారం, పాడేరులో ఇల్లు, మేజర్ అయిన తర్వాత ఉద్యోగం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:కేజీహెచ్​లో క్లినికల్​ ట్రయల్స్​కు ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూపులు

ABOUT THE AUTHOR

...view details