పోలీసుల అదుపులో అన్న ప్రొఫెసర్ సాయిబాబు, విరసం నాయకుడు వరవరరావులను విడుదల చేయాలని ఆదివాసీ విప్లవ ఐక్య సంఘటన తూర్పు విశాఖ జిల్లాల సంయుక్త కమిటీ కార్యదర్శి విజయ్ డిమాండ్ చేశారు. విప్లవకారుడు బోల్ష్విక్ స్ఫూర్తితో ప్రజలు, మేధావులు, అణగారిన వర్గాల కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. తూర్పు కనుమల్లో, నల్లమలలో బాక్సైట్, యురేనియం తవ్వకాలను చేపట్టాలని చూస్తున్న ప్రభుత్వ కుటిల ప్రయత్నాలను భగ్నం చేస్తామన్నారు. రాజ్యాధికారం కోసం మాట్లాడే వారిని ఇతర రాష్ట్రాల్లో బందీలుగా చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జైళ్లలో మగ్గుతున్న ప్రొఫెసర్ సాయిబాబు, వరవరరావులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
'బోల్ష్విక్ స్ఫూర్తితో... ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం' - ఆదివాసీ విప్లవ ఐక్య సంఘటన
జైళ్లలో మగ్గుతున్న ప్రొఫెసర్ సాయుబాబు, వరవరరావులను విడుదల చేయాలని ఆదివాసీ విప్లవ ఐక్య సంఘటన తూర్పు విశాఖ జిల్లాల సంయుక్త కమిటీ కార్యదర్శి విజయ్ డిమాండ్ చేశారు. విప్లవకారుడు బోల్ష్విక్ స్ఫూర్తితో ప్రజలు, మేధావులు, అణగారిన వర్గాల కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు.
'బోల్ష్విక్ స్ఫూర్తితో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం'