విశాఖలో భూసేకరణ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. బలవంతంగా ఎవరి నుంచీ భూమిని సేకరించేది లేదని చెప్పారు. అవసరమైతే ఒక రూపాయి ఎక్కువ ఇచ్చే భూసమీకరణ చేయాలని సీఎం చెప్పారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విజయనగరం జిల్లాలో చేపడుతున్న యాత్రపై మంత్రి బొత్స విమర్శలు చేశారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు విజయనగరాన్ని ఏమీ అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. జిల్లాలో చైతన్య యాత్ర పేరిట యాత్రలు చేసే ముందు చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు.
బలవంతంగా భూమి సేకరించడం లేదు: మంత్రి బొత్స - మంత్రి బొత్స సత్యనారాయణ వార్తలు
విశాఖలో బలవంతంగా భూసేకరణ చేయడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అవసరమైతే ఒక రూపాయి ఎక్కువ ఇచ్చే భూమి సేకరించాలని సీఎం చెప్పారని గుర్తు చేశారు. అలాగే ఏం చేశారని విజయనగరం జిల్లాలో పర్యటిస్తారో చంద్రబాబు చెప్పాలని విమర్శించారు.
మంత్రి బొత్స సత్యనారాయణ