ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక వ్యాపారి దాడిలో వీఆర్​ఏ తల్లి మృతి - sand trader

ఇసుక రవాణాను అడ్డుకున్నందుకు ఓ వీఆర్​ఏ కుటుంబంపై ఇసుక వ్యాపారి దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడి తల్లి గాయపడగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఇసుక

By

Published : Sep 22, 2019, 9:21 PM IST

విశాఖ జిల్లాలో ఇసుక వ్యాపారి దాడిలో గాయపడిన వీఆర్ఏ తల్లి చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. ఈనెల 8న భీమిలి మండలం టి.నగరపాలెం వీఆర్‌ఏ శివరామస్వామి కుటుంబంపై సూరిబాబు అనే ఇసుక వ్యాపారి దాడికి పాల్పడ్డాడు. ఇసుక రవాణాను అడ్డుకుంటున్నాడని ఈ చర్యకు ఒడిగట్టాడు. ఇసుక వ్యాపారి దాడిలో వీఆర్‌ఏ శివరామస్వామి, ఆయన తల్లి కాంతమ్మకు గాయాలయ్యాయి. అప్పటి నుంచి తగరపువలస ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంతమ్మ ఇవాళ మృతి చెందారు. వీఆర్‌ఏ తల్లిని హత్య చేసినట్లుగా సూరిబాబుపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details