ఉపాధి పనులకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చిన కారణంగా.. విజయనగరం జిల్లాలో వేతనదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. లాక్ డౌన్ కు ముందు జాతీయ ఉపాధి హామీ పనుల నిర్వహణలో రాష్ట్రంలో జిల్లా 12వ స్థానంలో నిలిచింది. ఈ నెల 20 నుంచి ఉపాధి పనులకు కేంద్రం లాక్ డౌన్ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చిన కారణంగా.. విజయనగరం జిల్లా రాష్ట్రంలో రెండో స్థానానికి చేరుకుంది.
'సామాజిక దూరం పాటిస్తూనే ఉపాధి పనులు' - ap coronavirus news
కొవిడ్-19 వైరస్ ప్రబలకుండా ఉపాధి హామీ పనుల నిర్వహణలో క్షేత్రస్థాయిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వేతనదారుల ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు చేపట్టారు? సామాజిక దూరం, పనుల ప్రాధాన్యత, వేతనాల పెంపు తదితర అంశాలపై విజయనగరం జిల్లా డ్వామా పీడీ నాగేశ్వరరావు ఈటీవీ భారత్తో మాట్లాడారు.
vizianagaram dwma pd nageshwararao
కరోనా ప్రభావంతో గత 20 రోజులుగా వేతనదారులు పనులకు దూరమయ్యారు. లాక్ డౌన్ నిబంధనల నుంచి వెసులుబాటు కల్పించిన కారణంగా.. ఉపాధి లేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కూలీలు పెద్దఎత్తున పనులు చేసేందుకు ముందుకొస్తున్నారు. సామాజిక దూరం పాటిస్తూ పనులను చేయిస్తున్నామని డ్వామా పీడీ నాగేెశ్వరరావు స్పష్టం చేశారు.