రాష్ట్రాభివృద్ధికి, ఉపాధి కల్పనకు అత్యంత ఆవశ్యకమైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తే... కార్మిక వర్గం ఊరుకోబోదని ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ (ఐసీఈయూ) విశాఖ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎన్.రమణాచలం అన్నారు. యూనియన్ ఆధ్వర్యంలో విశాఖ ఎల్ఐసీ భవనంలో 'విశాఖ ఉక్కు పరిరక్షణ' సదస్సు నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కును కాపాడుకుంటామని రమణాచలం స్పష్టం చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికులకు మద్దతుగా... రాష్ట్రంలోని బీమా ఉద్యోగులు, బీఎస్ఎన్ఎల్, రైల్వే, పోర్టు, బ్యాంకు, పోస్టల్ ఉద్యోగులతో సంయుక్త ఫ్రంట్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.