ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ బాధితులకు 'ఊపిరి' పోస్తున్న ఉక్కు కర్మాగారం - ap corona latest news

కొవిడ్​పై పోరులో విశాఖ ఉక్కు కర్మాగారం కీలక పాత్ర పోషిస్తోంది. వైరస్ బాధితులకు కావాల్సిన ఆక్సిజన్​ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి ఆసుపత్రులకు సరఫరా చేస్తోంది. ఇప్పటివ‌ర‌కు 4000 ట‌న్నుల ద్రవ రూప అక్సిజ‌న్ ఉత్పత్తి చేసి ఆసుప‌త్రుల‌కు అందించింది.

vizag steel  plant
vizag steel plant

By

Published : Sep 19, 2020, 5:00 PM IST

విశాఖ ఉక్కు క‌ర్మాగారం మెడిక‌ల్ అక్సిజన్ అందిస్తూ ప్రత్యేక‌త‌ను చాటుకుంటోంది. కొవిడ్ బారిన పడిన వారి ప్రాణాలను నిలబెట్టడంలో తన వంతు పాత్ర పోషిస్తోంది. కొవిడ్​పై పోరులో ఆక్సిజన్ పాత్ర అద్వితీయం. రోగి ఆరోగ్యం క్షీణించినప్పుడు కృత్రిమ శ్వాస అందిస్తారు వైద్యులు. ఈ క్రమంలో వైద్య అవసరాల కోసం ఉక్కు కర్మాగారం ఆక్సిజన్​ను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటివ‌ర‌కు 4000 ట‌న్నుల ద్రవ రూప అక్సిజ‌న్ ఉత్పత్తి చేసి రాష్ట్రంలోని ఆసుప‌త్రుల‌కు అందించింది. ఇది అత్యంత నాణ్యంగా ఉండ‌టం వ‌ల్ల వైద్య అవ‌స‌రాల‌ కోసం బాగా ఉప‌యోగ‌ప‌డుతోంది. ఈ విష‌యాన్ని విశాఖ ఉక్కు క‌ర్మాగారం అధికారులు ట్విటర్ ద్వారా వెల్లడించారు.

స్వయంగా ఉత్పత్తి

విశాఖ ఉక్కు క‌ర్మాగారంలో పనులకు ఆక్సిజన్​ను ఎక్కువగా వినియోగించాల్సి ఉంటుంది. బ్లాస్ట్ ఫ‌ర్నేస్​, ఆక్సిడేష‌న్ ప్రక్రియ‌లోనూ ఈ వాయువును వినియోగించాల్సి ఉంటుంది. ప్రతి రోజూ కొన్ని ట‌న్నుల ఆక్సిజన్​ను ఉక్కు ఉత్పత్తికి వినియోగిస్తారు. ఇదంతా ఉక్కు కర్మాగారం స్వయంగా తయారు చేసుకుంటుంది. సాధార‌ణంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేయాలంటే కేంద్రం విధించిన క‌ఠిన‌మైన నిబంధ‌న‌ల‌ను పాటిస్తేనే అనుమ‌తి ల‌భిస్తుంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్​లో ఆ స‌దుపాయం ఉండ‌డం వ‌ల్ల రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేర‌కు కొవిడ్ బాధితుల ప్రాణాల‌ు కాపాడేందుకు అవ‌స‌ర‌మైన మెడిక‌ల్ అక్సిజన్​ త‌యారీకి విశాఖ ఉక్కు కర్మాగారం చ‌ర్యలు చేప‌ట్టింది.

మరింత అందించేందుకు కార్యాచరణ

ఇప్పటివ‌ర‌కు స‌ర‌ఫ‌రా చేసిన 4000 ట‌న్నుల ద్రవ రూప అక్సిజన్​కి అద‌నంగా రాష్ట్ర ప్రభుత్వ అవ‌స‌రాల మేర‌కు ఉత్పత్తి చేసి అందించేందుకు స్టీల్ ప్లాంట్ కార్యాచ‌ర‌ణ‌ అమ‌లు చేస్తోంది. ఈ అక్సిజన్ నాణ్యతపై రాష్ట్ర ఔష‌ధ నియంత్రణ శాఖ కూడా సంతృప్తి వ్యక్తం చేసింది.

ABOUT THE AUTHOR

...view details