విశాఖలో పోలీసు అవసరాలపై డీజీపీ గౌతం సవాంగ్ ఒక కమిటీని ఏర్పాటు చేశారని నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా అన్నారు. వివిధ విభాగాలలో అవసరమైన మానవ వనరులు, సాంకేతిక వనరులపై ఈ కమిటీ అంచనా వేసి నివేదిక సమర్పిస్తుందని వెల్లడించారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ అవసరాల దృష్ట్యా ఇటీవలే డీజీపీ ఒక కమిటీని నియమించారు. ఇందులో వివిధ విభాగాధిపతులతో సహా కమిషనర్ సభ్యునిగా ఉన్నారు.
'విశాఖలో మానవ, సాంకేతిక వనరులపై కమిటీ అధ్యయనం చేస్తుంది'
విశాఖలో పోలీసు శాఖకు అవసరమైన మానవ, సాంకేతిక వనరులపై డీజీపీ సవాంగ్ నియమించిన కమిటీ అధ్యయనం చేస్తుందని నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా అన్నారు.
ఆర్కే మీనా, విశాఖ పోలీస్ కమిషనర్