విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్‌డీఏ) కొత్తగా రూపొందించిన ‘బృహత్తర ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) 2041’తో విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చాలా చోట్ల పై పరిస్థితి ఎదురవ్వొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పూర్తిగా గమనించకుండా రోడ్లను ప్రతిపాదించారని, ఫలితంగా అధిక సంఖ్యలో ప్రజల ఆస్తులకు నష్టం కలగొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. వీఎంఆర్‌డీఏ అనుమతిచ్చిన లేేఅవుట్లలోని ప్లాట్లు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతింటాయి. కొన్నిచోట్ల భూముల వినియోగం తారుమారైంది. ఈ నేపథ్యంలో అధికారులు రూపొందించిన ముసాయిదాను ప్రజలు ఓ సారి తనిఖీ చేసుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
సందేహాలుంటే...
విజయనగరం జిల్లాలో 16, విశాఖ జిల్లాలోని 19 మండలాల్లో 4,873 చదరపు కిలోమీటర్ల పరిధికి వీఎంఆర్‌డీఏ బృహత్తర ప్రణాళిక తయారు చేసింది. మొత్తం భూమిని నివాస, వాణిజ్య, బహుళవినియోగ, పారిశ్రామిక, గ్రీన్‌బెల్టు, పర్యాటకం, ప్రభుత్వ, రవాణాపరంగా వినియోగించేలా ప్రణాళిక తయారు చేశారు. ఇందులో జలవనరులు, కొండలు, అడవులు, వ్యవసాయభూములూ ఉంటాయి. వీటి వినియోగంపై అభ్యంతరాలుంటే ఈ నెల 15లోగా ఫిర్యాదు చేయొచ్ఛు వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ, విశాఖ, విజయనగరం కలెక్టరేట్లలో బృహత్తర ప్రణాళిక మ్యాప్‌లను ప్రదర్శనగా ఉంచారు. ఏమైనా సందేహాలుంటే 9866076938 నంబరుకు ఫోన్ చేయొచ్ఛు.
కనిపించని చిత్రాలు...
ప్రస్తుతం అందుబాటులో ఉంచిన మాస్టర్ ప్లాన్ పూర్తిగా అర్థంకాక ప్రజలు తలలుపట్టుకుంటున్నారు. మొత్తం ఆంగ్ల భాషలో ఉండడంతో నిపుణులకు తప్ప సామాన్యులెవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆ మ్యాప్‌లు కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లలో కనిపించక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందువల్ల గడువు మరికొంత కాలం పెంచాలనే డిమాండు వినిపిస్తోంది. వివిధ రూపాల్లో ఇప్పటి వరకు సుమారు 400కుపైగా ఫిర్యాదులు అందినట్లు సమాచారం.