ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సచివాలయ ఉద్యోగాల్లో బీజెడ్సీ​ ఉద్యోగులకు నిరాశ

గ్రామ సచివాలయ ఉద్యోగాల ఎంపిక విషయాలు రోజురోజుకు వివిధ మలుపులు తిరుగుతున్నాయి. రెండో కౌన్సెలింగ్​ నిర్వహిస్తున్న అధికారులు బీజెడ్​సీ అభ్యర్థులను ఆన్​లైన్​ ద్వారా కాల్​లెటర్​లు పంపించారు. అనంతరం అర్హత లేదంటూ తేల్చేశారు. తీవ్ర నిరాశ చెందిన అభ్యర్థులు అసహనం వ్యక్తం చేశారు.

బీజెడ్​ ఉద్యోగులకు కాల్​లెటర్​ వచ్చినా

By

Published : Oct 18, 2019, 9:31 PM IST

గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో తమకు న్యాయం చేయాలని విలేజ్ ఆర్టీ కల్చర్ అసిస్టెంట్ పరీక్ష రాసిన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లాలో సుమారు 290కుపైగా విలేజ్ ఆర్టీ కల్చర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు లేక ఖాళీలు మిగిలి పోయాయి. వీటికి సంబంధించి పరీక్షలు రాసిన కొంత మంది బీజేడ్సీ అభ్యర్థులకు ఆన్​లైన్ ద్వారా కాల్​లెటర్​లు వచ్చాయి. వీరంతా విశాఖలోని ఉద్యానవన శాఖ కార్యాలయంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు వచ్చారు. విశాఖ మన్యం మండలాలు, తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో అభ్యర్థులు వచ్చారు. ఎంపీఈవోగా గతంలో పని చేసిన అనుభవం కలిగిన పత్రం ఉండాలని పరిశీలన చేస్తున్న అధికారులు సూచించారు. దీంతో వీరంతా అధికారులు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు న్యాయం చేయాలని పరీక్ష రాసి అర్హత సాధించిన బీజెడ్ సీ అభ్యర్థులు కోరుతున్నారు.

బీజెడ్​ ఉద్యోగులకు కాల్​లెటర్​ వచ్చినా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details