ఎస్సీ యువకుడు శ్రీకాంత్‌కు నిర్మాత నూతన్ నాయుడు కుటుంబసభ్యులు, సిబ్బంది శిరోముండనం చేయించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఎస్సీ సంఘాల నాయకులు స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఎస్సీ నాయకుడు డాక్టర్ బూసి వెంకట్రావు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో ఎస్సీలపై ఇలాంటి దాడులు పెరిగిపోయాయన్నారు. మొన్న అమలాపురంలో, నేడు విశాఖలో శిరోముండనం ఘటనలు జరగడం దారుణమన్నారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని.. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
శిరోముండనం ఘటన..పీఎస్ ఎదుట ఎస్సీ సంఘాల ఆందోళన - విశాఖ శిరోముండనం కేసు తాజా వార్తలు
విశాఖ పెందుర్తిలో ఎస్సీ యువకుడు శ్రీకాంత్ శిరోముండనం కేసులో నిందితులను అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్సీ సంఘాలు నిరసన చేపట్టాయి. బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి.
పోలీస్ స్టేషన్ ఎదుట దళిత సంఘాల ఆందోళన