విశాఖ సాగర తీరం పర్యాటకుల తాకిడితో కళకళలాడుతోంది. సముద్రతీర అందాన్ని చూసేందుకు వచ్చిన పర్యటకులు, భానుడి భగభగల నుంచి ఉపశమనం కోసం వచ్చిన వారితో ఆర్కే బీచ్ బిజీగా మారుతోంది. కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు ఎటుచూసినా సందడి వాతావరణమే కనిపిస్తోంది. సాగర తీరంలో వైఎంసీఏ ఎదుట ఇటీవల రూపుదిద్దుకున్న పార్కు మరింత సందడిగా మారింది. పార్కు విశాలంగా ఉండడం...ఆడుకునేందుకు ఏర్పాట్లు చేయడంతో మైదానమంతా చిన్నారుల కేరింతలతో నిండిపోయింది.
సాయంకాలం.. సాగర తీరం.. ప్రజల సందడి - beach
సాగర నగర సుందర తీరం సందర్శకులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవుల కారణంగా పర్యాటకుల తాకిడితో విశాఖ బీచ్ సందడిగా మారింది. ఓ వైపు అలల హోరు... మరో వైపు ప్రకృతి ప్రేమికుల హొయలు కలిసి ఆర్కే బీచ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
విశాఖ తీరం
విశాఖ ఆర్కే బీచ్ అభివృద్ధిని చూసి పర్యాటకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బీచ్‌కు వచ్చినవారు అప్పటికి ఇప్పటికీ వచ్చిన మార్పులను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛ నగరంగా ఉన్న విశాఖలో బీచ్ రోడ్డు మరింత పరిశుభ్రంగా కనిపిస్తోందని అంటున్నారు. చల్లని గాలుల మధ్య సముద్ర అలల హోరును వింటూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.