విశాఖలో పెరిగిన గ్యాస్ ధరలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో ఇబ్బంది పడుతన్న వేళ.. రోజురోజుకూ గ్యాస్ ధర పెంచి సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. "ఆసరా ఫించన్, అమ్మ ఒడి ఇవ్వమని మేము అడిగామా, అవి ఇచ్చి ఇలా ధరలు పెంచడం ఏంటి?" అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
"ఇది వరకు నాలుగు వందలు ఉండే గ్యాస్ ఇప్పుడు ఎనిమిదిన్నర వందలు దాటుతోంది. ఒక్కగ్యాస్ కే వెయ్యి రూపాయలు దరిదాపులకు వెళ్తే.. మిగిలిన సరుకులు ఎలా" అని మహిళలను అంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పథకాల పేరుతో ఏదీ కోరలేదని.. గ్యాస్ ధర మాత్రమే తగ్గించాలని వారు వేడుకుంటున్నారు.