అమ్మఒడి పథకంపై కోత వద్దంటూ విశాఖలో తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ కోరింది. అమ్మఒడి పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థికి అమలు చేయాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ కోరారు. సాంకేతిక కారణాలు చూపి కోత విధించడం దుర్మార్గమని అన్నారు.
'అమ్మ ఒడి పథకంపై కోత వద్దు'
అమ్మఒడి పథకంపై కోత వద్దంటూ టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. సాంకేతిక కారణాలు చూపి కోత విధించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేసింది.
vishakapatnam tnsf on ammavadi
విద్యుత్ బిల్లు రూ.300 దాటితే అనర్హులుగా లెక్కకట్టడం విడ్డూరమని అన్నారు. సచివాలయం వ్యవస్థను గొప్పగా చెప్పుకుంటున్నపుడు సాంకేతిక సమస్యలు సాకుగా చూపడం సరికాదన్నారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలోని అధికారికి వినతి పత్రం అందజేశారు.
ఇదీ చదవండి: మిషన్ బిల్డ్ ఏపీ కేసు: హైకోర్టులో విచారణ 28కి వాయిదా