మహా విశాఖ నగర పాలక సంస్థలో 9 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత పాలక వర్గం ఇవాళ ఏర్పాటవుతోంది. 8 నియోజకవర్గాల పరిధి నుంచి 98 వార్డుల ప్రాతినిధ్యం... కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇక నుంచి కనిపించనుంది. నగర రూపు రేఖల్ని మార్చే దిశగా సభ్యులు పని చేయాలని... ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. విశాఖలో నూతనంగా ఏర్పాటు కానున్న కౌన్సిల్ నగర అభివృద్ధి, జీవన ప్రమాణాల పెంపుదలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరుతున్నారు.
పాలక వర్గం మౌలిక వసతులను మెరుగు పరిచే దిశగా కృషి చేయాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. స్మార్ట్ నగరిగా, స్వచ్ఛ నగరంగా విశాఖ పేరును మరింత సుస్థిరం చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అంటున్నారు. జీవీఎంసీ నిధులను అన్ని వార్డులకు సంపూర్ణంగా వినియోగించాలని విశాఖ వాసులు సూచిస్తున్నారు. విశాఖలో కాలుష్య నియంత్రణ సహా పర్యావరణ హిత అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో కౌన్సిల్ ఆలోచనలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.