ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ పోర్టు ఛైర్మన్  ఆధ్వర్యంలో డీసీఐ - CHAIRMAN

విశాఖలోని మినీరత్న సంస్థ అయిన తవ్వోడల.... ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ డ్రైడ్జింగ్ సంస్ధల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. విశాఖ పోర్టుకు ఛైర్మన్ గా ఉన్నవారే డీసీఐకు ఛైర్మన్​గా వ్యహరించనున్నారు.

విశాఖ పోర్టు ఛైర్మన్  ఆధ్వర్యంలో డీసీఐ

By

Published : Mar 12, 2019, 6:29 AM IST

విశాఖ పోర్టు ఛైర్మన్ ఆధ్వర్యంలో డీసీఐ

విశాఖలోని మినీరత్న సంస్ధ అయిన తవ్వోడల సంస్ధ( డ్రెడ్జింగ్ కార్పొరేషన్) పోర్టుల సమాఖ్య పరమైంది. విశాఖ పోర్టు, కాండ్లా, ముంబై, పారాదీప్ పోర్టుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సంస్ధ నడవనుంది. డీసీఐను ప్రైవేటీకరించాలన్న ప్రతిపాదన ఎట్టకేలకు ఒక రూపం సంతరించుకుంది.
సహజ నౌకాశ్రయం ఉన్న విశాఖ కేంద్రంగా తవ్వోడల సంస్ధ (డ్రెజ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) 1976వ సంవత్సరంలో ఏర్పడింది. 43 ఏళ్ల సుదీర్ఘ ప్రస్ధానంలో సంస్ధ సాధించిన విజయాలకు కొదవలేదు. సంస్ధ ఏర్పడ్డనాటి నుంచి నష్టాలను చవిచూడకుండా నెట్టుకువచ్చింది. భారీ ఎత్తున లాభాలను ఆర్జించకపోయినా నష్టాలు లేకపోవడం ఈ సంస్ధ పనితీరుకు నిదర్శనం. డ్రెడ్జింగ్ రంగంలో దేశంలోని ఏకైక ప్రభుత్వ రంగం సంస్ధగా ఉంటూ ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ డ్రైడ్జింగ్ సంస్ధల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

పూర్తిగా ప్రైవేటు పరం చేయాలన్న కేంద్రం అలోచన వెలువడిన వెంటనే డీసీఐ ఉద్యోగుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. 2017లో ఉద్యోగులు అందోళనలు, నిరసనల బాట పట్టారు. మానవ వనరుల విభాగ సహాయకుడు వెంకటేశ్ అనే ఒక ఉద్యోగి ఏకంగా ఆత్మహత్యకు పాల్పడటంతో వివాదం తీవ్రమైంది. ఆయా ఆందోళనల దాటికి తలొగ్గిన కేంద్రం ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రైవేటు వ్యక్తులకు కాకుండా ప్రభుత్వరంగ పోర్టులకే డీసీఐ నిర్వహణ బాధ్యతను అప్పగిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఉద్యోగులు ఊపీరి పీల్చుకున్నారు. ప్రైవేటు సంస్ధలకు డీసీఐను అప్పగిస్తే తమను ఉద్యోగాలు నుంచి తొలగించడమే కాకుండా విశాఖలో ఉన్న డీసీఐ కార్యాలయాన్ని కూడా తరలించేస్తారేమోనని ఉద్యోగులు తొలుత తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ముంబయిలోని జెఎన్ పిటి, గుజరాత్ లోని కాండ్లా పోర్టు, ఒడిశాలోని పారాదీప్, ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ పోర్టుల కంటే 1.5 శాతం అధిక వాటా కొనుగోలు చేయించి విశాఖ పోర్టు ఛైర్మన్ ఆధ్వర్యంలో డీసీఐ కార్యకలాపాలు సాగించే విధంగా ఏర్పాట్లు చేశారు.
పోర్టుల కన్సార్టియంలో అధిక వాటా ఉన్న విశాఖ పోర్టుకు ఛైర్మన్ గా ఉన్నవారే డీసీఐకు కూడా ఇకపై ఛైర్మన్ వ్యహరించనున్నారు. డీసీఐ ఎండీ పదవిరద్దయింది. ఇప్పటి వరకు సీఎండీగా వ్యవహరించిన రాజేశ్ త్రిపాఠీనేఎండీగా కొనసాగిస్తారు. విశాఖ పోర్టు ఛైర్మన్ డీసీఐ ఛైర్మన్ గా.... మిగిలిన మూడు పోర్టుల ఛైర్మన్లు డైరెక్టర్లుగా విధులు నిర్వర్తిస్తారు. వీరితో పాటు మరో ఐదుగురు ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా వ్యవహరించనున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details