ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ తీరం నుంచి మంత్రి పదవులెవరికో? - రాష్ట్ర కేబినెట్

విశాఖపట్నం జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు.. 11 స్థానాల్లో పాగా వేసింది వైకాపా. ఇక పార్లమెంటు స్థానాల్లో మూడింటినీ బద్ధలు కొట్టింది. మరీ ఈ జిల్లా నుంచి మంత్రి వర్గంలో చోటెవరికి? పదవి కోసం బరిలో నిలిచిన ఆ నలుగురికే కేబినెట్​లో అవకాశం దక్కనుందా? నలుగురిలో ఒక స్థానంపై సందిగ్ధం ఎందుకు?

vishaka_political_ministers

By

Published : Jun 2, 2019, 7:12 AM IST

విశాఖ జిల్లా నుంచి మంత్రి వర్గంలో చోటు కోసం నలుగురు బరిలో ఉన్నారు. అయితే అనకాపల్లి నుంచి గెలిచిన...అమర్నాథ్​, భీమిలి నుంచి విజయం సాధించిన అవంతి శ్రీనివాసరావులో ఎవరో..ఒకరికి మాత్రమే పదవి వచ్చే అవకాశాలున్నాయి. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన శాసన సభ్యులు కావడమే ఇందుకు కారణం.

విశాఖ తీరం నుంచి మంత్రి పదవులెవరికో?
మాడుగుల నుంచి గెలిచిన ముత్యాలనాయుడు, పాయకరావుపేట నుంచి 3సార్లు గెలిచిన గొల్ల బాబురావు విశాఖ గ్రామీణ ప్రాంతం నుంచి మంత్రి వర్గ బరిలో ఉన్నారు. విశాఖ రూరల్​కు ఒక్క స్థానం కల్పించే నేపథ్యంలో బాబురావు, ముత్యాలనాయుడు మధ్య పోటీ ఉంది. ఎవరూ లక్కీ ఛాన్స్ కొట్టేస్తారా అనేది ఇంతా ఎటు తేలకుండానే ఉంది. మంత్రివర్గ విస్తరణపై జిల్లా నేతలే కాదు... జిల్లా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details