ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్తకోట తెలుగు అధ్యాపకుడికి ఏయూ డాక్టరేట్ - ఏయూ డాక్టరేట్ వార్తలు

విశాఖ జిల్లా కొత్తకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలుగు అధ్యాపకుడికి ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ లభించింది. యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ప్రసాద్ రెడ్డి షేక్ హబీబ్​ మీరాకు డాక్టరేట్ అందించారు.

doctorate
కొత్తకోట తెలుగు అధ్యాపకుడికి ఏయూ డాక్టరేట్

By

Published : Jan 1, 2021, 1:01 PM IST

విశాఖ జిల్లా రావికమతం మండలం కొత్తకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలుగు అధ్యాపకుడు షేక్ హబీబ్ మీరాకు డాక్టరేట్ గౌరవం లభించింది. తెలుగు భాష విభాగంలో ఆచార్య గజ్జ యోహాను బాబు పర్యవేక్షణలో 'సలీమ్ రచనలు- పరిశీలన' అనే అంశంపై సిద్ధాంత వ్యాస గ్రంథాన్ని సమర్పించినందుకు ఈ పురస్కారం లభించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రసాద్ రెడ్డి నుంచి హబీబ్ మీరా డాక్టరేట్ స్వీకరించారు. డాక్టరేట్​ పొందిన షేక్ హబీబ్ మీరాను కొత్తకోట కళాశాల అధ్యాపక సిబ్బంది అభినందనలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details