విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం జలాశయం ప్రకృతి అందాలు కొలువైన ప్రాంతం. అయితే జలాశయానికి వెళ్లే ప్రధాన మార్గం అధ్వానంగా ఉంది. జలాశయం ముఖద్వారం వద్ద మట్టిరోడ్డు రాళ్లు తేలి ఉంది. ఏళ్లు గడుస్తున్నా.. జలాశయం మార్గం అభివృద్ధి చేయలేదు. దీంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి జలాశయ ముఖద్వారం వద్ద రోడ్డు వేయాలని ప్రజలు కోరుతున్నారు.
కోనాం ప్రాజెక్టుకి వెళ్లే రోడ్డు.. బాగుపడేదెప్పుడో..? - కోనాం జలాశయం రోడ్డు అభివృద్ధి కార్యక్రమం
విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం జలాశయం ప్రాంతంలో చుట్టూ కొండలు.. ప్రకృతి సహజ అందాలు కొలువై ఉన్నాయి. ఇక్కడికి పర్యాటకులు ఎక్కువగానే వస్తుంటారు. అయితే జలాశయానికి వెళ్లే ముఖద్వారం వద్ద రోడ్డు అధ్వానంగా ఉంది. దీంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.
konam project road