విశాఖ జిల్లాలో పది మండలాల్లో భూ సమీకరణ జరుగుతోందని కలెక్టర్ వెల్లడించారు. ఇళ్ల నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చే వ్యక్తులకు ల్యాండ్‌పూలింగ్ ఓనర్ షిప్ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పారు. భూసమీకరణ కోసం ప్రభుత్వం రూ.1300 కోట్లు నిర్దేశించిందని తెలిపారు. భూ సమీకరణ ద్వారా 950 ఎకరాలు వీఎంఆర్డీఏకు సమకూరుతాయని అన్నారు. ఈ భూమి విశాఖ జిల్లాలో నూతన అభివృద్ధి పథకాలకు వినియోగించనున్నామని స్పష్టం చేశారు.
'రైతులకు ఇబ్బంది కలగకుండానే భూసమీకరణ' - విశాఖ జిల్లాలో భూసమీకరణ
విశాఖ జిల్లాలో బలవంతపు భూ సమీకరణ జరగడం లేదని కలెక్టర్ వినయ్‌చంద్ చెప్పారు. పది మండలాల్లో భూసమీకరణ కొనసాగుతోందని వెల్లడించారు. ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమించి ఉంటే వారితో సామరస్యంగా చర్చించిన తర్వాతే ప్రక్రియ చేపడుతున్నామని చెప్పారు.
vinay chand