ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో ఇద్దరు బ్యాంక్​ అధికారుల మోసం.. జైలుశిక్ష

IDBI Bank Officials Fraud : విశాఖలోని ఐడీబీఐ బ్యాంక్​ ఉద్యోగులు భారీ మోసానికి తెర లేపారు. ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై ఏకంగా 2కోట్ల రూపాయల వరకు బ్యాంకును లూటీ చేశారు. అర్హత లేని వారికి, సిబిల్​ స్కోరు నెగెటివ్​గా ఉన్న వారికి రుణాలు ఇచ్చి.. ఈ మోసానికి ఉద్దేశ్యపూర్వకంగా పాల్పడ్డారని విశాఖ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించిది.

prision
జైలు శిక్ష

By

Published : Jan 2, 2023, 9:43 PM IST

IDBI Bank Officials Committed to Fraud in Visakha : విశాఖలోని ఐడీబీఐ బ్యాంకును మోసగించిన కేసులో అదే బ్యాంక్​లో పనిచేస్తున్న అధికారులకు, ఎనిమిది మంది ప్రైవేటు వ్యక్తులకు విశాఖలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శిక్షలను ఖరారు చేసింది. మూడు కేసుల్లో మొత్తం పది మందికి కఠిన జైలు శిక్షలతో పాటుగా అపరాధ రుసుం విధిస్తూ.. విశాఖ సీబీఐ న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి హిమబిందు తీర్పు వెల్లడించారు. ఐడీబీఐ విశాఖ రిటైల్ అసెట్ సెంటర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా ఉన్న సురేంద్రనాథ్‌ దత్తిని మూడు కేసులలో దోషిగా తేల్చి.. రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది.

ఇదే బ్యాంక్​లో మరో ఏజీఎమ్​ ద్విభాష్యం కార్తీక్‌కు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, 30వేల జరిమానా విధించింది. ఐడీబీఐ ప్యానల్​ వాల్యుయర్​ కోతా కామరాజు, చార్టర్డ్ ఇంజనీర్ బెలగాం శ్రీనివాసరావుకు ఏడాది కఠిన కారాగార శిక్షతో పాటు 40 వేల రూపాయల జరిమానాను విధించింది. మిగతా ఆరుగురికి ఏడాది జైలు శిక్షతో పాటు 20 వేల రూపాయలు జరిమానా చెల్లించాలని కోర్టు తెలిపింది. అధికారాన్ని వినియోగించి సెంటర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ సురేంద్రనాధ్ దత్తి, ఇంకా ద్విభాష్యం కార్తీక్​లు అర్హత లేని వారికి మంజూరు చేసి.. బ్యాంక్​కు దాదాపు 2కోట్ల రూపాయల నష్టాన్ని కలిగించారని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్దారించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details