వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో ప్రాపర్టీ షో కొనసాగుతోంది. రియల్ ఎస్టేట్ రంగానికి నరెడ్కో ప్రాపర్టీ షో సరికొత్త ఉత్సాహాన్ని తెచ్చిందని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. ప్రాపర్టీ షో స్టాళ్లను ఆయన సందర్శించారు. ప్రజలు, కొనుగోలుదారులకు ఉపయోగపడే విధంగా ప్రదర్శన ఉందన్నారు. అనంతరం స్థిరాస్తి కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
నరెడ్కో ప్రాపర్టీ షోను సందర్శించిన ఎంపీ - విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ
విశాఖలో నరెడ్కో ఆధ్వర్యంలో నిర్వహించిన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ షోకు 3వ రోజు అద్భుత స్పందన వచ్చింది. పెద్ద సంఖ్యలో సందర్శకులు స్టాళ్లను సందర్శించి తమ అభిరుచికి తగిన స్థిరాస్తిని ఎంపిక చేసుకున్నారు.
నరెడ్కో ప్రాపర్టీ షో ను సందర్శించిన ఎంపీ