విశాఖపట్టణం జిల్లాలో అధిక సంఖ్యలో ఓటర్ల నమోదుకు కృషి చేసిన కలెక్టర్ వి. వినయ్ చంద్కి ఎన్నికల సంఘం నుంచి అవార్డు లభించింది. రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ నుంచి అవార్డును అందుకున్నారు. ఓటర్ల జాబితా సవరణ, కొత్తగా ఓటు నమోదు కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలు చేశారు. జాబితాలో మార్పులకు సంబంధించిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరించారు. ఆయన పనితీరును గుర్తించిన ఎన్నికల సంఘం... అవార్డుతో సత్కరించింది.
అధిక ఓట్ల నమోదుకు కృషి చేసిన కలెక్టర్కు అవార్డ్ - గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తాజా వార్తలు
జిల్లాలో ఎక్కవగా కొత్తగా ఓట్ల నమోదుకు, జాబితా సవరణను విజయవంతంగా పూర్తి చేసిన విశాఖ కలెక్టర్ వి. వినయ్ చంద్ ఎన్నికల సంఘం నుంచి అవార్డ్ పొందారు. 11వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని గవర్నరు బిశ్వ భూషణ్ హరిచందన్ ఆయనకు... అవార్డును బహుకరించారు.
కలెక్టర్ కు అవార్డ్
అవార్డు రావడం పట్ల జిల్లా పరిపాలానాధికారి వినయ్ చంద్ సంతోషం వ్యక్తం చేశారు. సిబ్బంది సమష్టిగా పని చేయడం వల్లే సాధ్యమైందని తెలిపారు. ఇది అందరి విజయమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఔరా ఈ చెట్టు... ఏడు వందలకు పైగా టెంకాయలు!