VisakhaTDP Leaders Fired on YSRCP Government: జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని విశాఖ పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డిపై వ్యతిరేకత ఉందన్న ఆయన ఎంతమంది ఇంఛార్జులను మార్చినా ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, జరగుతున్న పరిణామాలు ఆ పార్టీలో సంక్షోభాన్ని సూచిస్తున్నాయని, ఎంత వేగంగా ప్రజలు వీరికి సాగనంపుదామన్న ఉద్దేశ్యంతో ప్రజలు ఉన్నారన్నారు. జగన్‌ని మార్చడమే దీనికి మార్గమని, ఎన్నికలలో ఘన విజయం సాధించి, టీడీపీ-జనసేన ప్రభుత్వం రానుందని పల్లా అన్నారు.
Ganta Srinivas rao on YSRCP Govt: రాష్ట్రంలో జగన్‌ను మార్చాలని ప్రజలు కోరుకుంటున్నారని ఇన్‌ఛార్జులు, ఎమ్మెల్యేలను మార్చటం వల్ల ఉపయోగం లేదని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. జగన్ సైకలాజికల్ డిజార్డర్‌తో బాధపడుతున్నారని ఎద్దెవా చేశారు. జగన్‌కి బై బై చెప్పాలన్నది ప్రజల ఆకాంక్షగా అభివర్ణించారు. దేశంలోనే మూడో అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి మాట తప్పారని ఆగ్రహంవ్యక్తం చేశారు. మూడు రాజధానుల విషయంలో స్పష్టత లేకుండా వ్యవహరిస్తున్నారని గంటా మండిపడ్డారు.
దళితుల సంక్షేమంపై చర్చకు సిద్ధమా ? - వైసీపీకి టీడీపీ సవాల్
Gandi Babji comments on YCP: హామీలు అమలు చేస్తామని అబద్ధాలు చెబుతూ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులు, యువత జీవితంతో జగన్ ఆటలాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మండిపడ్డారు. 400కోట్లతో రుషికొండలో జగన్ ప్యాలెస్ కట్టుకున్నారని బాబ్జీ విమర్శించారు. జగన్ రాష్ట్రానికి అప్పులు పెంచి ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని మండిపడ్డారు. జగన్ చేసిన మోసాలను గమనించి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం కృషి చేసిన చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ అక్రమ కేసులు పెడుతోందని బాబ్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల జీవితాలతో వైసీపీ ప్రభుత్వం చెలగాటం: టీడీపీ నేతలు
Ganababu Comments on Jagan: ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రొజెక్టు 2021కి పూర్తి చేస్తామని చెప్పి గాలికి వదిలేశారన్నారు. అర్చకుల, జర్నలిస్టులు, లాయర్లకు ఇళ్లు ఇస్తామని హామీలు ఇచ్చారు. అంగన్వాడీల, హోంగార్డులు, ఆశావర్కర్లకు తెలంగాణ కన్నా రూ.1000 అదనంగా పెంచుతామన్న హామీపై మడమ తిప్పారని మండిపడ్డారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరిస్తామని చెప్పారని గణబాబు మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.
ప్రజలకు అవగాహన కోసమే జగన్ 85శాతం ఫెయిల్ బుక్ అబద్దపు హామీల పునాదులపై కట్టిన వైసీపీ గోడలు కూలిపోతున్నాయి: టీడీపీ నేతలు