ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడే విశాఖ ఉక్కు కార్మికులు మహా గర్జన.. తగ్గేదేలే అంటున్న కేంద్రం - తగ్గేదేలే అంటున్న కేంద్రం

UKKU MAHA GARJANA SABHA: విశాఖ స్టీల్‌ప్లాంటు ఉద్యమం తీవ్రరూపు దాలుస్తోంది. విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గకపోవడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నేడు మహా గర్జన పేరిట నిరసన చేపట్టనున్నారు.

Ukku Maha Garjana Sabha
ఉక్కు కార్మికులు మహా గర్జన

By

Published : Jan 30, 2023, 7:23 AM IST

UKKU MAHA GARJANA SABHA:విశాఖ స్టీల్‌ప్లాంటు ఉద్యమం తీవ్రరూపు దాలుస్తోంది. ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నేడు మహా గర్జన పేరిట నిరసన చేపట్టనున్నారు. గర్జనకు రావాలని ఇప్పటికే అన్ని రాజకీయ పక్షాలకు ఆహ్వానాలు పంపిన పోరాట సమితి నేటి సభతో ఉక్కు పరిశ్రమ ప్రభుత్వరంగంలోనే కొనసాగుతుందనే నిర్ణయం వస్తుందని ధీమా వ్యక్తంచేస్తోంది.

తగ్గేదేలే అంటున్న కేంద్రం..ఉద్యమం ఉద్ధృతం:విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గకపోవడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రెండేళ్లుగా పోరాటం చేస్తున్నా కేంద్రం స్పందింకపోవడంతో నేడు మరో పోరుకు సిద్ధమయ్యారు. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయడానికి మహాగర్జన పేరుతో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయనున్నారు. తీర్మానానికి మద్దతు పలకాలని అన్ని రాజకీయ పక్షాలను కోరనున్నారు. ఈ మేరకు సభకు హాజరవ్వాలని ఆయా పార్టీలకు ఆహ్వానాలు పంపారు.

దేశ సంపదను ప్రైవేటీకరణ: కేంద్ర ప్రభుత్వం సొంత గనులు సమకూర్చనందున ప్రతి సంవత్సరం 2 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయవలసి వస్తున్నప్పటికీ 2021-22 సంవత్సరానికి 945 కోట్ల మేర లాభాలు సాధించిందని కార్మికులు గుర్తుచేశారు. ఐనా కేంద్ర ప్రభుత్వం ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని ఆలోచించడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దేశ సంపదను ప్రైవేటీకరణ పేరుతో మరొకరికి కట్టబెడుతుంటే తాము ఊరుకోబోమని కార్మికులు చెబుతున్నారు. నేటి సభ ద్వారా కేంద్రంపై ఒత్తిడిని పెంచుతామని ప్రభుత్వరంగంలోనే పరిశ్రమ కొనసాగేలా చేస్తామని స్పష్టంచేస్తున్నారు.

మౌనంగా ఉన్న అధికారం: రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించనందునే కేంద్రం ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తోందని టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు.


మహాగర్జన నిరసన:కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా మహాగర్జన నిరసన ఉంటుందన్న కార్మికులు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సైతం కలసిరావాలని విజ్ఞప్తి చేశాయి.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details