విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 5 న నిర్వహించనున్న రాష్ట్ర వ్యాప్త బంద్‌ను జయప్రదం చెయ్యాలని కమిటీ సభ్యులు కోరారు. బంద్‌కు సంబంధించిన గోడ పత్రికలను నాయకులు ఆవిష్కరించారు.
కూర్మన్నపాలెం నిరాహార దీక్షల శిబిరం వద్ద గోడ పత్రికలను కమిటీ సభ్యులు విడుదల చేశారు. ఈ బంద్‌లో కార్మికులు అధిక సంఖ్యలో హాజరు కావాలని... నిరసనను జయప్రదం చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.