ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రాచీన ఆలయాల అభివృద్ధికి పురావస్తు శాఖ నిబంధనలు అడ్డుగా మారాయి' - Kishan Reddy updates

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి కలిశారు. ప్రాచీన ఆలయాల అభివృద్ధికి అడ్డుగా మారిన పురావస్తు శాఖ షరతులు, నిబంధనలపై చర్చించారు. తెలంగాణలో వేయి స్తంభాల గుడి, ఆంధ్రలో పంచారామ క్షేత్రాలు... పురావస్తు శాఖ నియమ నిబంధనల కారణంగా అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Swatmanandendra Saraswati Swamy meets Union Minister Kishan Reddy
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి

By

Published : Jul 12, 2021, 1:24 PM IST

దిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి కలిశారు. సాంస్కృతిక, పురావస్తు శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి నివాసానికి వెళ్లి.. ప్రాచీన ఆలయాల అభివృద్ధికి అడ్డంకిగా మారిన పురావస్తు శాఖ షరతులు, నిబంధనలపై చర్చించారు. ప్రాచీన నిర్మాణాలపై పురావస్తుశాఖ పర్యవేక్షణ ఎంత ముఖ్యమో, వాటి సంరక్షణకు అభివృద్ధి కూడా అంతే ముఖ్యమని తెలిపారు. తెలంగాణలో వేయి స్తంభాల గుడి, ఆంధ్రలో పంచారామ క్షేత్రాలు... పురావస్తు శాఖ నియమ నిబంధనల కారణంగా అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంప్రదాయ, జానపద కళల పరిరక్షణకు విశేషంగా కృషి చేయాలన్నారు.

విశాఖ శ్రీ శారదాపీఠం ఈనెల 24వ తేదీ నుంచి చేపట్టనున్న చాతుర్మాస్య దీక్ష గురించి కేంద్ర మంత్రికి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వివరించారు. రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు కిషన్ రెడ్డి దంపతులకు ఉండాలని ఆకాంక్షించారు. ఆదిశంకరాచార్య ప్రతిమను బహుకరించి... శాలువతో కిషన్ రెడ్డి దంపతులు సత్కరించారు. తన అధికారిక నివాసానికి విచ్చేసిన స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామిని దగ్గరుండి కిషన్ రెడ్డి దంపతులు సాగనంపారు .

ఇదీ చదవండి

TTD: తితిదే అదనపు ఈవో కార్యాలయం వద్ద భక్తుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details