పట్టాలు తప్పిన విశాఖ-కిరండోల్ ప్యాసింజర్ రైలు.. తప్పిన పెను ప్రమాదం
Train derailed: ప్రయాణికులతో వెళ్తున్న రైలు ప్రమాదానికి గురైంది. విశాఖ-కిరండోల్ ప్యాసింజర్ స్పెషల్ పట్టాలు తప్పింది. జైపూర్-చిత్రూపుట్ స్టేషన్ల మధ్య ఈ రైలులో ఒక స్లీపర్ కోచ్, మూడు జనరల్ బోగీలు పట్టాలు తప్పాయని.. అయితే, ప్రయాణికులంతా సురక్షితంగానే బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులకు ఎవరికీ ఏమీకాలేదని.. వారి ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.
train derailed