ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విమాన ప్రయాణానికి దోమల బెడద..

దోమల కారణంగా విశాఖ విమానశ్రయంలో విమానం గంట ఆలస్యంగా వచ్చింది.

By

Published : Feb 5, 2019, 5:38 AM IST

Masquitos

విమాన ప్రయాణానికి దోమల బెడద..
విమానాశ్రయంలో ప్రయాణికులంతా తామెక్కవలసిన విమానం కోసం ఎదురుచూస్తున్నారు. అంతలోనే వచ్చిన ఓ అనౌన్స్ మెంట్ వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. వారు ఎక్కాల్సిన విమానం దోమల కారణంగా ఆలస్యమైందంటూ... వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా...విశాఖ విమానశ్రయంలో ఈ ఘటన నిజంగా జరిగింది. దోమల వల్ల ఓ విమానం ఏకంగా గంట ఆలస్యమైయ్యింది. వాతావరణ పరిస్థితులే కాదు, చిన్న ప్రాణులు కూడా అటంకాలు సృష్టిస్తాయని ఈ ఘటన రుజువు చేసింది.

విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం స్వచ్చ విమానాశ్రయంగా గుర్తింపు పొందినప్పటికీ, రన్​వే చుట్టూ పెద్ద డ్రైనేజీలు ఉన్నాయి. వీటి వలన రాత్రి వేళల్లో విమానశ్రయ పరిసరాల్లో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. విమానాశ్రయంలో ఈ దోమల బెడదను అరికట్టలేకపోయారు. మరిన్ని అంతర్జాతీయ సర్వీసులను ఆరంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన విమానశ్రయ అధికారులకు కొత్త సమస్యను తెచ్చింది. దోమల కారణంగా 2 రోజుల క్రితం ఒక ఇండిగో విమానం ఏకంగా గంట పాటు ఆలస్యమైంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details