ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పల్లెల్లోనే... మెరుగైన జీవనం'

హైదరాబాదులోని ఓ సాఫ్ట్​వేర్ కంపెనీలో పనిచేస్తున్న హరీష్, సుధాకర్, రవి అనే ముగ్గురు వ్యక్తులు సైకిల్ యాత్ర చేస్తున్నారు. నగరాల్లో విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యానికి వ్యతిరేకంగా ఈ యాత్ర చేస్తూ... పల్లెల ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తున్నారు.

పల్లె మనది-మరవద్దు ఆ సంగతీ!

By

Published : Feb 4, 2019, 9:04 PM IST

పల్లె... మనదన్న సంగతి మరవద్దు!
'దేశానికి పల్లలే పట్టుకొమ్మలు' అన్నారు మహానుభావుడు గాంధీజీ... అక్కడి వాతావరణం అలాంటిది మరీ! పచ్చని చెట్ల నుంచి వచ్చే పల్లె గాలులు...ఎంత ఉన్నత స్థానంలో ఉన్న వారికైనా సొంత ఊరును గుర్తుచేస్తాయి. హైదరబాదుకి చెందిన సాఫ్ట్​వేర్ ఉద్యోగులకూ చల్లగాలుల చల్లదనం గుర్తుకొచ్చినట్టుంది. అందుకే... పట్టణాల్లో కన్నా పల్లెల్లోనే మంచి వాతావరణం ఉంటుంది అంటున్నారు. అంతేకాదు దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సైకిల్ యాత్రను చేపట్టారు.

పల్లెను మరవద్దు...
హైదరాబాదులోని ఓ సాఫ్ట్​వేర్ కంపెనీలో పనిచేస్తున్న హరీష్, సుధాకర్, రవి అనే ముగ్గురు వ్యక్తులు సైకిల్ యాత్ర చేస్తున్నారు. నగరాల్లో విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యానికి వ్యతిరేకంగా ఈ యాత్ర చేస్తూ... పల్లెల ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తున్నారు. హైదరాబాదు నుంచి భద్రాచలం మీదుగా నర్సీపట్నం వరకు సాగే ఈ యాత్ర ఈరోజు విశాఖపట్నం జిల్లా గూడెంకొత్తవీధి మండలం సీలేరుకు చేరుకుంది. కనుమరుగైపోతున్న పల్లె వాతావరణాన్ని సంరక్షించుకునే బాధ్యతపై ప్రజలకు వీరు అవగాహన కల్పిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details