ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 21, 2021, 10:35 AM IST

ETV Bharat / state

అనకాపల్లిలో నిబంధనలు పాటించని 10 వాహనాలు సీజ్

నిబంధనలు పాటించని లారీలను విశాఖ జిల్లా అనకాపల్లిలో విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఎలమంచిలో అక్రమంగా గ్రావెల్ తవ్వుతున్నట్లు సమాచారం రావడంతో.. అధికారుల తనిఖీలు చేసి పొక్లైయిన్​ను సీజ్ చేశారు.

vigilance  seized ten vehicles at anakapalli
అనకాపల్లిలో నిబంధనలు పాటించని 10 వాహనాలు సీజ్

విశాఖజిల్లా అనకాపల్లిలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా క్వారీనుంచి మెటల్​ను తరలిస్తున్న 10 వాహనాలను గనులశాఖ
విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ ఏడీ ప్రతాపరెడ్డి పట్టుకున్నారు. ఎలమంచిలిలో నిబంధనలు పాటించకుండా గ్రావెల్ తవ్వుతున్న క్వారీని సీజ్ చేసి.. లక్ష జరిమానా విధించి పొక్లైయిన్​ను స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details