ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పలు జిల్లాల్లో వెలుగు యానిమేటర్ల ఆందోళన - వెలుగు యానిమేటర్ల ఆందోళన వార్తలు

నెలకు పదివేల జీతం జీవోని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వెలుగు యానిమేటర్లు చేపట్టిన ఆందోళన రాత్రివేళ కొనసాగుతోంది. రోడ్డుపైనే వంట చేస్తూ తమ నిరసన తెలియజేశారు. డిమాండ్లు నెరవేర్చేవరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.

రోడ్డు పైన వంట చేస్తూ వెలుగు యానిమేటర్ల ఆందోళన

By

Published : Nov 4, 2019, 11:17 PM IST

Updated : Nov 5, 2019, 12:02 AM IST

రోడ్డు పైన వంట చేస్తూ వెలుగు యానిమేటర్ల ఆందోళన

నెలకు పదివేల జీతం జీవోని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వెలుగు యానిమేటర్లు చేపట్టిన ఆందోళన రాత్రివేళ కొనసాగుతోంది. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళలు వంటావార్పు చేశారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున యానిమేటర్లు తరలివచ్చారు. నిరసన విరమించుకోవాలని పోలీసులు మహిళలను హెచ్చరిస్తూ.. 36 గంటల అనుమతి పత్రాన్ని బలవంతంగా తీసుకున్నారు. పోలీసుల దురుసు ప్రవర్తనతో వీవోఏలు ఆందోళన చేపట్టారు. రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్తామని పోలీసులను ప్రశ్నించారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద వీవోఏలు నిరసన దీక్ష చేపట్టారు. కలెక్టరేట్ వద్ద వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించేవరకు ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద వెలుగు యానిమేటర్లు ఆందోళన చేపట్టారు. కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 3 గంటలనుంచి నిరసన కొనసాగుతోంది. మచిలీపట్నం కలెక్టరేట్‌ వద్ద రోడ్డుపై వంట చేస్తూ తమ నిరసన తెలియజేశారు.

ఇవీ చదవండి...

వేతన జీవోను అమలుచేసి.. మా జీవితాల్లో 'వెలుగు' నింపన్నా...!

Last Updated : Nov 5, 2019, 12:02 AM IST

ABOUT THE AUTHOR

...view details