విశాఖ జిల్లా అనకాపల్లిలో యువతిపై జరిగిన దాడి ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. విశాఖ ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి సూచించారు. బాధితురాలిని పరామర్శించేందుకు వాసిరెడ్డి పద్మ నేడు విశాఖ వెళ్లనున్నారు.
'యువతిపై దాడి అమానుషం...నిందితుడిని కఠినంగా శిక్షించాలి'
విశాఖ జిల్లా అనకాపల్లిలో ప్రేమించిన యువతిపై కత్తితో దాడి చేశాడో ఉన్మాది. యువతి ప్రాణాపాయస్థితిలో ఉంది. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి స్పందించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. యువతిని పరామర్శించేందుకు ఆమె నేడు విశాఖ వెళ్లనున్నారు.
'యువతిపై దాడి అమానుషం...నిందితుడిని కఠినంగా శిక్షించాలి'