విశాఖ జిల్లా భీమునిపట్నంలో చిట్టివలస జూట్ మిల్ లాకౌట్ ఎత్తివేయలని మెకానికల్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. తగరపువలస అంబేద్కర్ జంక్షన్ పెట్రోల్ బంక్ ఎదుట యూనియన్ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు.కార్మికుల నిరాహార దీక్ష విశాఖ జిల్లా భీమునిపట్నంలో చిట్టివలస జూట్ మిల్ లాకౌట్ ఎత్తివేయలని మెకానికల్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. తగరపువలస అంబేద్కర్ జంక్షన్ పెట్రోల్ బంక్ ఎదుట కార్మిక నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. జూట్ మిల్ లాకౌటై పదేళ్లు గడుస్తున్నా... ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. పేమెంట్ ఆఫ్ వేజెస్ 1936 చట్టం ప్రకారం వేతనాలు చెల్లించవలసిందిగా కోరారు. కార్మికులకు రావాల్సిన బకాయిలు న్యాయబద్ధంగా తక్షణమే చెల్లించాలని కోరారు.